భానుడే మబ్బులని ఇడిసాడే
మకరాణ పండుగ తెచ్చాడే
బసవుడే భజనలు మెచ్చాడే
హరికథై హరిదాసొచ్చాడే
జల జల మురిసేనంట
పుడమి పై గోదావరి
ధగ ధగ మెరిసేనంట
రైతింట ధాన్య వరి
ఏడాది కష్టాన్ని
మొత్తంగా మరిచే
రోజంటూ ఉంటే
అదేరా సంక్రాంతి…
తోం తకిట తక సంక్రాంతి
తధిమ్ తకిట తక సంక్రాంతి
తోం తకిట తక సంక్రాంతి
తధిమ్ తకిట తక సంక్రాంతి
గోబ్బిళ్లు పార్ట్:
గోబ్బిళ్లో గోబ్బిళ్లు
అలమెలమ్మకి గోబ్బిళ్లు
గోబ్బిళ్లో గోబ్బిళ్లు
అన్నపూర్ణకి గోబ్బిళ్లు
మొరలనాలకించు మురళి మనోహర ముద్దు కన్నయ్యకి గోబ్బిళ్లు
ప్రేమ రూపిణి హృదయ వాసిని
రాధాదేవికి గోబ్బిళ్లు
తోం తకిట తక సంక్రాంతి
తధిమ్ తకిట తక సంక్రాంతి
తోం తకిట తక సంక్రాంతి
తధిమ్ తకిట తక సంక్రాంతి
హే దూరాలెన్నైనా దాటేస్తాములే
ఊరే చేరుటకు ఈ రాత్రి
సొంతూరోలతో పండగంటే
ఇక మరచిపోవులే ఏ రాత్రి
ఏద కలతలు చెరిపి
మమతలు నిలిపే భోగి పల్ల భోగి
సంబరాల సన్నాయి పాటలై
చిందులేసెర సంక్రాంతి
ఆడి పాడే సందళ్ళ
వాకిలై మెరిసిపోయేరా సంక్రాంతి
తోం తకిట తక తధిమ్ తకిట తక తధిమ్ తకిట తక సంక్రాంతి
తకిట తకిట తక తధిమ్ తకిట తక తధిమ్ తకిట తక సంక్రాంతి